News

సండ్రకు 14 రోజుల రిమాండ్‌


ఓటుకు నోటు కేసులో నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంగళవారం ఏసీబీ కోర్టు రెండు వారాల పాటు (ఈనెల 21 వరకు) రిమాండ్‌ విధించింది. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది